ముఖం, జుట్టు సంరక్షణతో పాటు గోళ్లను కూడా కాపాడుకోవాలి. కాల్షియం, విటమిన్-ఎ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. చేతులు కడుక్కున్న ప్రతిసారి ...
- కాల్షియం, విటమిన్-ఎ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
- చేతులు కడుక్కున్న ప్రతిసారి మోచేతుల నుంచి గోళ్ల చివర్ల వరకు నీళ్లలో శుభ్రం చేయాలి.
- హాండ్ లోషన్ ని ఇంట్లో రెడీగా ఉంచుకుని చేతులు నీటిలో నానినప్పుడల్లా రాసుకోవాలి.
- వీలయినప్పుడు గోళ్లకు నూనెతో మసాజ్ చేస్తే గోళ్లు బలంగా దృఢంగా ఉంటాయి.
- ఇంటిపనులు, తోటిపని చేసేటప్పుడు గ్లవ్స్ ధరించడం మరిచిపోవద్దు.
- బాగా వేడిగా ఉన్న నీటిని చేతులకు తగలనివ్వద్దు.
- పదునైన మెటల్ పరికరాలను ఉపయోగించి గోళ్లను శుభ్రం చేయవద్దు.
- గోళ్లను శుభ్రం చేయటానికి నెయిల్ బ్రష్ ని, ఆరంజ్ స్టిక్ గాని వాడాలి.
- గోళ్లు పగిలి బీటలు వారితే కొన్నాళ్లు పాటు నెయిల్ పాలీష్ వేసుకోకూడదు.
- గోరు పై వాడే నెయిల్ కట్టర్ లేదా నెయిల్ సిజర్ ను శుభ్రంగా ఉంచితే ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటాయి.
- డబ్బాల మూతలు తీయటానికి, ఫోన్ నంబర్ రింగ్ చేయటానికి గోళ్లను ఉపయోగించకూడదు.
- చేతులను ఎక్కువసేపు డిటర్జెంటులో నానపెట్టకూడదు.
COMMENTS