మన ఆహార విధానంలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు అజీర్తి సమస్య సర్వసాధారణంగా కనబడుతున్నది. తీసుకునే ఆహారం , దినచర్యల వలన ఈ సమస్య చిన్నతన...
మన ఆహార విధానంలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు అజీర్తి సమస్య సర్వసాధారణంగా కనబడుతున్నది. తీసుకునే ఆహారం, దినచర్యల వలన ఈ సమస్య చిన్నతనంనుంచే వేధిస్తున్నది. సరైన పద్ధతిలో కూర్చుని తినకపోవటం, సమయం తప్పితినటం, మధ్యరాత్రుల్లో తినటం, నిద్రలేకపోవటం ఇవన్నీ అజీర్తికి కారణాలు అవుతాయి.
మరికొన్ని కారణాలు
- సరిగ్గా నమిలి తినకపోవటం, ఎక్కువగా తినటం, హడావుడిగా తినటం, నిలబడి తినటం
- పచ్చికూరగాయలు, పచ్చిపాలు, గుడ్లు వీటిని శరీరంతత్వం తెలుసుకోకుండా తిన్నపుడు
- పచ్చి కూరగాయలు, గింజధాన్యాలు మొదలైనవి తింటూ బరువు తగ్గించుకోవటం ఆరోగ్యరీత్యా అందరికీ ఆమోదయోగ్యం కాదు.
- పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం వలన ఆకలి మందగించడం, జీర్ణకోశం, కిడ్నీలు, లివర్, గుండె వీటిపై ఆ ప్రభావం పడటం ఉంటుంది.
- పొత్తికడుపులో నొప్పి, తిన్న తరువాత కడుపు బరువుగా ఉండటం, గుండెల్లో మంట, వాంతి లక్షణాలు, పిత్తాశయం ద్వారా ఆపానవాయువు బయటకు రావటం నోరు రుచించకపోవటం నోటి నుంచి దుర్వాసన రావటం, కడుపు పైభాగంలో నొప్పి మొదలైన లక్షణాలు ఉంటాయి.
- శారీరక వ్యాయామం లేకపోవటం, ఆహార మధ్యలో అధికంగా నీరు తాగటం, నిద్రలేమి, భయం, ఆందోళనలు కూడా ఇందుకు కారణాలు.
నివారణ చిట్కాలు :
ఈ కారణాల వల్ల ఈ రుగ్మతకు గురయినపుడు ఇందులోంచి బయటపడటానికి:
- మొదటి పదిరోజులు పండ్లు, పండ్ల రసాలు మాత్రమే తీసుకోవాలి. వీటితో పాటు మజ్జిగను తీసుకోవాలి.
- నిమ్మరసం కూడా విశేషంగా పనిచేస్తుంది. రోజుకు నాలుగు నుండి ఆరు గ్లాసులు నిమ్మరసం తాగటం వలన బ్యాక్టీరియా నశించి జీర్ణశక్తి పెరుగుతుంది.
- కమలాపళ్లు, ద్రాక్ష, పైనాపిల్ రసాలు అజీర్తికి చక్కగా పనిచేస్తాయి.
COMMENTS