మనస్పర్థలతో మానసికానందం మాయం

సంసారంలో మనస్పర్థలు నేటి రోజుల్ని యాంత్రిక యుగంగా  చెప్పుకుంటున్నాం. మనుషుల మధ్య బంధాలు కూడా అంతే యాంత్రికంగా అయిపోతున్నాయని వాపోతున్న ...

సంసారంలో మనస్పర్థలు
నేటి రోజుల్ని యాంత్రిక యుగంగా  చెప్పుకుంటున్నాం. మనుషుల మధ్య బంధాలు కూడా అంతే యాంత్రికంగా అయిపోతున్నాయని వాపోతున్న వారిని చాలామందినే చూస్తున్నాం. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఆస్తి తగాదాలు కోర్టుల వరకు వెళ్ళటం కూడా  ఇప్పుడు  ఏమాత్రం విచిత్రం కాదు. అయితే ఒకటి నిజం. అనుబంధాల మధ్య చీలికలు ఎంతగా వచ్చినా కొన్ని బంధాలు కలకాలం నిలుపుకోవాల్సినవి ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవటం, అంతకంటే ముఖ్యంగా ఈ విభేదాల మధ్య మనసు నలిగిపోకుండా కాపాడుకోవటం తప్పనిసరి. 

  • దగ్గరివారితో మనస్పర్ధలు వచ్చినపుడు వారితో వ్యవహరించడం చాలా కష్టమైన విషయంగా ఉంటుంది. వారి మీదున్న ప్రేమాప్యాయతలు, వారితో పెనవేసుకున్న భావోద్వేగాలు  మరింత ఇరుకున పెడుతుంటాయి. రకరకాల భావాలు ముప్పిరిగొని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇటువంటపుడు ఎలా ప్రవర్తించాలి అనేది పెద్ద సమస్యగా కనబడుతుంది.
  • అవతలి వారి పట్ల కోపతాపాల్ని ప్రదర్శించాలనీ ఉంటుంది. అదే సమయంలో వారు తమని అర్థం చేసుకుని పూర్వపు బంధం తిరిగి చక్కగా కొనసాగాలనే ఆశా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరి వ్యక్తిత్వం వారు నిలబెట్టుకుంటూ ప్రవర్తించడం కష్టసాధ్యమైన విషయమవుతుంది. అవతలి వారిపై అనవసరపు కోపతాపాలు ప్రదర్శించకుండా, తాము లేనిపోని అపరాధ భావనకు గురికాకుండానూ ఉండాలంటే...
  • మాట్లాడుతున్నపుడు అవతలి వ్యక్తి కళ్లలోకి నేరుగా చూడండి. తలవంచుకోవటం, కళ్లు పక్కకు తిప్పుకోవటం వంటివి చేయకండి. మీ మాటతీరుని కూడా సరిచూసుకోండి. మరీ పెద్దగా లేదా మరీ చిన్నగానూ మాట్లాడకండి.
  • పరస్పర సంభాషణల్లో వ్యక్తిగత దూషణలకు తావివ్వకండి. ఆయా సందర్భాల్లో మీకు నచ్చని అవతలివారి ప్రవర్తన గురించి మాత్రమే మాట్లాడండి. 
  • ఇక, మీ పట్ల వారి అనుచిత ప్రవర్తనని చెప్పాల్సి వచ్చినపుడు పదిసార్లు నువ్వలా చేసావు. ఇలా చేసావు అంటూ- 'నువ్వు' అనే పదాన్ని ఎక్కువసార్లు ఉపయోగించకండి. అప్పుడు వారి తప్పుల్ని పదేపదే ఎత్తి చూపినట్టు తీవ్రంగా విమర్శించినట్టు అవుతుంది. అలాకాకుండా ఆయా సందర్బాల్లో మీరు ఎదుర్కొన్న బాధలమీద మీ మానసిక వేదన మీద మీ దృష్టిని ఉంచండి. 
  • 'ఆ సందర్భంలో నేనింత బాధపడ్డాను. ఆ మాటలు నన్నింత బాధించాయి...'ఇలా సాగాలి.
  • అంటే ఇదంతా అవతలివారిమీద ద్వేషంతోనో, పగతోనో అంటున్నది కాదు, మీరు ఎదుర్కొన్న అసౌకర్యాన్ని చెప్పడం మాత్రమే అని అర్థమవ్వాలి.
  • ఏ కారణం వల్ల మీ బంధం విచ్ఛిన్నమైనా అందులో మీ పాత్ర ఎంతవరకు ఉందో దానిని అవతలివారికి వివరించండి.
  • మీ తప్పొప్పుల గురించి మరీ ఎక్కువ వివరణ ఇవ్వాల్సిన  అవసరం లేదు. అది పరోక్షంగా పూర్తి తప్పుని మీమీద వేసుకున్నట్టు అవుతుంది.
  • ఇరువురి మధ్య బంధాన్ని పునరుద్ధరించే సందర్భాల్లో ఉన్నతంగా ప్రవర్తించండి.  మన్నించడం ముఖ్యం ఆయా సంఘటనల వెనుక కారణం ఎవరైనా మీ దృక్పథంలో సానుకూల వైఖరి ఉండాలి.
  • ఆప్తులతో మీకెంత ఎడబాటు వచ్చినా వారిపట్ల మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతల్లో మాత్రం తేడా రానివ్వకండి. ఇతర బంధువుల ద్వారానో, స్నేహితులద్వారానో ఆ బాధ్యతలు నిర్వర్తించండి.
  • మిమ్మల్ని ఎంతగా బాధించినా ఆయా వ్యక్తుల మీద వ్యక్తిగతద్వేషాన్ని పెంచుకోకండి. మిమ్మల్ని బాధించిన సంఘటనలు అప్పటి వారి ప్రవర్తనని మాత్రమే ఖండించండి. వ్యక్తుల్ని, వారి పనుల్ని వేరు చేసి చూడటం అలవాటు చేసుకోండి.
  • ఈ మనస్పర్థలు అడ్డుపెట్టుకుని ఎప్పటెప్పటివో తప్పొప్పులు తవ్వాలని ప్రయత్నించకండి. ఇది పలచబడుతున్న బంధాన్ని పూర్తిగా తెంపుతుంది. ఆ సందర్భాన్ని, సంఘటనల్ని మాత్రమే ఎత్తిచూపండి.
  •  మిమ్మల్ని ఇతరులు నిందిస్తున్నారు అంటే అందుకు కారణాలు ఏమిటి అనేది నిష్పక్షపాతంగా పరిశీలించండి. అవి ఇది వరకటి మీ ప్రవర్తనకు సమాధానాలే అయితే ఇక అక్కడితో మీరు స్పందిం చకుండా ఆగిపోండి. మళ్లీ మీ నుంచి ప్రతిస్పందన ఉంటే విరోధానికి కొత్త విత్తనాలు చల్లినట్టే.
  •  మిమ్మల్ని వారు నిందించారని బాధపడే ముందు ఒక విషయం గమనించండి. కొన్ని విషయాలకు మిమ్మల్ని బాధ్యుల్ని చేసినట్టే, కొన్ని అననుకూల సందర్భాల్ని తామూ ఎదుర్కొన్నట్టు వారు ప్రకటిస్తున్నారు.
  • ఏ బంధం కలకాలం నిలవాలన్నా ఒకరి నొకరు అర్థం చేసుకోవటం ఎంత ముఖ్యమో క్షమా గుణం అంతకంటే ముఖ్యమని గ్రహించాలి. ఎందుకంటే చిన్నచిన్న అలకలు, కోపాలనుంచి పెద్ద స్థాయి మానసిక అగాథాల వరకు ఇవన్నీ అన్ని బంధాల్లోనూ అత్యంత సహజం. వాటిని అలా కొనసాగించడమే పూర్తి అసహజం

COMMENTS

పేరు

చిట్కాలు,11,beauty tips,27,family tips,2,fitness tips,19,girl health,6,health,9,health articles,30,health tips,26,ladies,17,ladies health,18,men health,4,skin care,7,women,10,women 40+,4,
ltr
item
Maahila: మనస్పర్థలతో మానసికానందం మాయం
మనస్పర్థలతో మానసికానందం మాయం
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj739fcPIe64ClhUvvwbsEojGvVXmtj4ILH_zydhzf7E4AJehzN6f6G5oCyl3Gex9fzlKCXqvX_KmdKzGkThPuLUglLCduxWOdyCDUQbC66AhuWc8ylRpdpeaemSXnVpLNKnBFxBL-UD10/s1600/family+quaral.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj739fcPIe64ClhUvvwbsEojGvVXmtj4ILH_zydhzf7E4AJehzN6f6G5oCyl3Gex9fzlKCXqvX_KmdKzGkThPuLUglLCduxWOdyCDUQbC66AhuWc8ylRpdpeaemSXnVpLNKnBFxBL-UD10/s72-c/family+quaral.jpg
Maahila
https://maahila.blogspot.com/2014/07/blog-post_69.html
https://maahila.blogspot.com/
http://maahila.blogspot.com/
http://maahila.blogspot.com/2014/07/blog-post_69.html
true
7782749441422950976
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy