బాధ పడడం కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి , వాటిని తడిగా ఉంచడానికి కళ్ళు స్రవించే ద్రవాన్ని కన్నీరు అంటారు. దుఃఖం , సంతోషం వంటి బలమైన భావోద్...
![]() |
| బాధ పడడం |
కంటిలోని పొరలను శుభ్రం చేయడానికి, వాటిని తడిగా ఉంచడానికి కళ్ళు స్రవించే ద్రవాన్ని కన్నీరు అంటారు. దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినపుడు కన్నీరు బయటకు వస్తుంది.
కన్నీరు స్రవించే విధానం బట్టి కన్నీరుని మూడు విధాలుగా విభజించవచ్చు.
కలక కన్నీరు
ఏదైనా ధూళి లేదా రసాయనలు వంటివి తగిలి కంటికి ఇబ్బంది కలిగినపుడు (ఉదా. ఉల్లి, మిరియం పొడి, దుమ్ము వంటివి) కంటి నుండి కన్నీరు స్రవిస్తుంది. ముక్కులో కలిగే వాసన వల్ల, తీవ్రమైన కాంతి వలన, నోటికి ఘాటైన రుచి కలిగినపుడు కూడా ఈ కన్నీరు స్రవిస్తుంది.
కంటిని శుభ్రం చేసే కన్నీరు
కంటి కార్నియాను తడిగా, శుభ్రంగా ఉంచడానికి, దుమ్మును నివారించానికి మరియు కొంత పోషక పదార్ధాలను అందించడానికి కళ్ళు నిరంతరం కన్నీటిని స్రవిస్తాయి. ఈ కన్నీటిలో నీరు, మ్యుసిన్, లిపిడ్‌లు, లైసోజైములు, లాక్టోఫెర్రిన్, ఇమ్యునోగ్లోబిలిన్‌లు, గ్లూకోస్, యూరియా, సోడియం, పొటాషియం వంటి అనేక పదార్ధాలు ఉన్నాయి.
ఏడవడం వలన కన్నీరు
బలమైన భావోద్వేగాలు, నొప్పి, తడబాటు వంటి వాటి కారణంగా కూడా కన్నీరు వెలువడుతుంది. ఇలా జరిగినప్పడు ముఖం ఎర్రబడడం, గొంతులో గర గర, శరీరం కంపించడం వంటివి కూడా జరుగుతాయి.
ఎడవడం లేదా భాద కలిగినప్పడు వచ్చిన కన్నీరులో ప్రోటీన్ సంబంధిత పదార్ధాలు, హార్మోనులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఉద్వేగ సమయంలో నరాలలో జరిగే సంకేతాల కారణంగా ఇలా జరుగుతుంది.
కన్నీటిలో ఔషధ గుణాలు
కన్నీరు ఆరోగ్యానికి మంచిదని, ఏడిస్తే అనారోగ్యం దూరం అవుతుందనీ, ప్రశాంతత చేకూరుతుందనీ వివిధ పరిశోధనల్లో తెలింది. ఆరోగ్యంగా ఉండాలంటే మనస్ఫూర్తిగా కన్నీళ్లు పెట్టుకోండి. వెక్కివెక్కి ఏడ్వండి. ఉద్వేగాలను దాచుకుని బాధ పడటం కంటే ఏడిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ఫరిశోధకులు చెబుతున్నారు.
ఏడుపుతో ఒంటి నొప్పి, ఒత్తిడి తగ్గుతాయి. మానసికోద్వేగాల పరంగానూ ఉపయోగాలున్నాయి. కన్నీరు మానసిక అనుబంధాన్ని బలిష్టం చేస్తుంది. మనుషుల మధ్య బంధాన్ని మరింత గాఢంగా మార్చే శక్తి కన్నీటికి ఉంది. బాధ, దుఖం, కన్నీరు ఎదుటి వారిని తృప్తి పరుస్తుంది. బంధాన్ని, స్నేహాన్ని పెంచుతుంది. ఏడుపుతో అనుబంధాలు బలపడతాయి. ఏడుపు ఒత్తిడిని తగ్గిస్తుందన్నది తెలిసిందే. అయితే, అది వ్యక్తిగత సంబంధాలనూ మెరుగుపరుస్తుందని కూడా పరిశోదకులు నిర్ధారించారు. అంతే కాక, కన్నీరు కార్చడం వలన ఇరువురి మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఉందని తేలింది.

COMMENTS