యాంత్రిక జీవన శైలి నానాటికీ పెరిగిపోతుది. దీని కారణంగా మనలో చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్నారు. అయితే ఎంత ఒత్తిడి కలిగినా దాని నుండి బయట ...
రుచికరమైన పదార్ధలు తినటం వల్ల మనకు జిహ్వ పై ఉన్న నరాలలో ఉత్తేజం ఏర్పడి తొందరగా ఫ్రెష్ అవుతాం. ఇందులో సందేహమే లేదు. అందుకే ఒత్తిడిలో ఉన్నప్పుడు మీకు నచ్చిన వంటకాన్ని వెరైటీగా ట్రై చేసి చూడండి.
ప్రకృతి ఒడిలో ఎంత సేపైన సేద తీరవచ్చు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు తోటపని చేయటం మంచిది. తోటపని మిమ్మల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. ప్రకృతికి చేరువైతే మీ మనస్సుకు విశ్రాంతి, ప్రశాంతత కలుగుతుంది. మాకు తోట లేదే అని అలోచిస్తున్నారా.! అయితే ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకుని అక్కడ సీద తీరితే సరి. పచ్చని చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ఈనాడు ఒత్తిడిని తగ్గించే మార్గాలలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తోంది యోగా. ప్రశాంతకరమైన జీవనాన్ని అలవరచుకోవాలంటే యోగా చేస్తే చాలు. యోగా ఒత్తిడిని దూరం చేస్తుంది. యోగా ద్వారా శరీరంలోని కండరాలు సాగి, సడలింపు చెంది తద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
మనం ఎప్పుడైనా గమనిస్తే పుస్తకం చదివేప్పుడు మమకు తెలియకుండానే నిద్ర ముంచుకొస్తుంది. అంతే చదివేప్పుడు ఏకాగ్రత వల్ల మనం ఒత్తిడిని మరచిపోతాం. ఒత్తిడిలో ఉన్నప్పుడు రీడింగ్ మీకెంతో సహకరిస్తుంది. మీరు మీకు ఇష్టమైన మంచి పుస్తకాలను సేకరించండి. మంచి పుస్తకాలు చదవండి.
సంగీతం. సంగీతాన్ని వింటే రాళ్ళు సైతం కరుగుతాయాంటారు . అందుకే మీకు నచ్చిన పాటలు వినండి. మీ మనసుకు ఆందోళన కలిగించే విషయాల నుండి దూరంగా ఉంచి, తక్షణ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
COMMENTS